ఏటీఎం మిష‌న్లూ పేలుతున్నాయి.. భ‌ద్రం బీకేర్‌ఫుల్‌

atm

నిన్న‌టిదాకా మొబైల్ ఫోన్లు పేలాయి…. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంద‌రో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు…. మ‌రెంద‌రో మ‌ర‌ణించారు.. మొబైల్ ఫోన్లు మొబైల్ బాంబులుగా మారాయి… జేబులో ఫోన్లు జేబులోనే పేలిపోతున్నాయి… ఇలాంటి సంఘ‌ట‌న‌లు మ‌నం చాలా చూశాం.. అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్లే కాదు…. ఏటీఎం మిష‌న్లు కూడా పేలిపోతున్నాయి… డ‌బ్బులు డ్రా చేద్దామ‌ని ఏటీఎం మిష‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు అదే పేలిపోతే ఏంటి ప‌రిస్థితి? ఏటీఎం అంటే ఎనీ టైమ్ మ‌నీ కాదు…. ఎనీ టైమ్ పేలిపోయే బాంబు అంటూ బెంబేలెత్తుతున్నారు క‌స్ట‌మ‌ర్లు… తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న త‌ర‌చు ఏటీఎంల‌కు వెళ్లేవాళ్ల‌ను భ‌య‌పెడుతోంది… వాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది… అస‌లేమైందంటే ఈమ‌ధ్య న‌ల్గొండ‌లో ఓ ఏటీఏం మిష‌న్ ఢాం అంటూ పేలిపోయింది… మొత్తం ఏటీఎం సెంట‌ర్ అంతా ధ్వంస‌మైపోయింది…

న‌ల్గొండ జిల్లా నాగార్జున‌సాగ‌ర్‌లోని పైలాన్ జెన్‌కో కాల‌నీలో ఎస్‌బీహెచ్ ఏటీఎం సెంట‌ర్ ఏర్పాటుచేశారు….ఆదివారం మ‌ధ్యాహ్నం నాడు డ‌బ్బు డ్రా చేద్దామ‌ని కొంద‌రు ఆ ఏటీఎంకి వెళ్లారు… అంతే ఉన్న‌ట్టుండి పెద్ద శ‌బ్దంతో ఆ ఏటీఎం పేలిపోయింది… ఏటీఎం సెంట‌ర్ అంతా ధ్వంస‌మైపోయింది…. అక్క‌డ‌కు వెళ్లిన‌వాళ్లకి ఏమీ కాలేదు… అయితే ఏటీఎం సెంట‌ర్ ఇలా పేలిపోయేస‌రికి చుట్టుప‌క్క‌ల ఉన్న జ‌నం అవాక్క‌య్యారు…. ఏటీఎం సెంట‌ర్ పేలిపోవ‌డం ఏంటో అర్థం కాక జ‌నం జుట్టు పీక్కుంటున్నారు…. అయితే ఇది షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్ల పేలిపోయింద‌ని పోలీసులు చెబుతున్నారు.. ఏదీ ఏమైనా ఏటీఎం పేలిపోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది….సో.. అర్ధ‌రాత్రి అప‌రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ప‌డితే అప్పుడు వెళ్లి మీరు ఏటీఎంని గీకితే అది మిమ్మ‌ల్ని గోకే ప్ర‌మాదం ఉంది…బాంబులా విరుచుకుప‌డే ప్ర‌మాదం ఉంది. త‌స్మాత్‌జాగ్ర‌త‌.

Loading...

Leave a Reply

*