మ‌ణిర‌త్నానికి వార్నింగ్ ఇచ్చిన ఆర్మీ

mani-ratnam

మ‌ణిర‌త్నం… భార‌తీయ సినిమా రంగంలో మ‌ణిమ‌కుటం… ఇండియ‌న్ డెరెక్ట‌ర్ల‌లో మ‌ణి లాంటివాడు.. ఆయ‌న తీసే సినిమాలు ఆణిముత్యంలా ఉంటాయి… క‌ళాత్మ‌క విలువ‌ల‌తో ఉంటాయి… మ‌ణిర‌త్నం సినిమాల‌కు మ‌నీ రావ‌డ‌మే కాదు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా వ‌స్తుంటాయి… ఆర్ట్ సినిమాలు హార్ట్ సినిమాలు క‌ల‌గ‌లిపి తీస్తారాయ‌న‌… ఆయ‌న తీసిన సినిమాల‌న్నీ అద్భుత దృశ్య కావ్యాలే అని చెప్ప‌చ్చు… ఒక‌టా రెండా ఆయ‌న కీర్తి కిరీటంలో ఎన్నో క‌లికితురాయిలు ఉన్నాయి… నాయ‌కుడు, రోజా, బొంబాయి వంటి సినిమాలు వేసిన ముద్ర ఎప్ప‌టికి చెర‌గ‌దు… అయితే ఆయ‌న‌కు తాజాగా ఇండియ‌న్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది…. రీల్ షూటింగ్ చేస్తే తుపాకుల‌తో రియ‌ల్ షూటింగ్ జ‌ర‌పాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది… ఆర్మీ హెచ్చ‌రిక‌ల‌తో ఈ ద‌ర్శ‌క మేధావి బెంబేలెత్తిపోతున్నాడు…

మ‌ణిర‌త్నానికి ఆర్మీ వార్నింగ్ ఇవ్వ‌డం ఏంట‌ని అవాక్క‌యిపోతున్నారా… అయితే అస‌లు విష‌యం ఏంటంటే… మ‌ణిర‌త్నం తాజాగా కాట్రు వెళ్ల‌దిలాయిన చిత్రాన్ని నిర్మిస్తున్నారు…. కార్తీ, అతిథిరావు జంటగా న‌టిస్తున్న ఈ సినిమా ఇప్ప‌టికే చాలావ‌ర‌కు షూటింగ్ పూర్తిచేసుకుంది…. తాజాగా మ‌ణిర‌త్నం సినిమా షూటింగ్ విష‌యంలో ఇండియ‌న్ ఆర్మీ ఆయ‌న‌కు వార్నింగ్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది…. ఈ సినిమా షూటింగ్‌ని జ‌మ్మూకాశ్మీర్‌లోని ల‌డ‌ఖ్ ప్రాంతంలో చిత్రీక‌రించాల‌ని ప్లాన్ చేశారుట‌… అయితే ఇప్పుడు కాశ్మీర్‌లో తాజాగా పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాద ముష్క‌రులు సైనికుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్న సంగ‌తి తెలిసిందే… లేటెస్టుగా ఉడీ దాడుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు… దీంతో ల‌డ‌ఖ్‌లో షూటింగ్ చేయ‌వ‌ద్దంటూ మ‌ణిర‌త్నాన్ని ఆర్మీ హెచ్చ‌రించిన‌ట్టు తెలుస్తోంది… దీంతో త‌న షూటింగ్ లొకేష‌న్‌ను మ‌ణి మార్చుకుంటారేమో చూడాలి.

Loading...

Leave a Reply

*