తెలియ‌క సొంత తాత‌నే పెళ్లాడింది.. తెలిసాక ఏం చేసిందంటే..?

america-girl

ఇదో విచిత్ర‌మైన క‌థ‌. ప్ర‌పంచంలో ఏ ర‌చ‌యిత కూడా ఊహించ‌ని క‌థ‌. సొంత తాత‌నే మ‌నువాడిన మ‌న‌వరాలి పెళ్లి క‌థ‌. అవును, మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే. అమెరికాలో జ‌రిగిన ఈ విచిత్ర వివాహం, అది బ‌య‌ట‌ప‌డిన తీరును చూసి షాక్ అవుతున్నారు జ‌నాలు. ఈ ఇంట‌రెస్టింగ్ స్టోరీ మీరూ చ‌ద‌వండి..

మూడు నెల‌ల క్రితం.. 24 ఏళ్ల యువ‌తికి 68 ఏళ్ల వ్య‌క్తితో పెళ్లి అయింది. వాళ్లిద్ద‌రూ క‌లిసి ఓ రోజు మియామీ బీచ్‌కి వెళ్లారు. అక్క‌డ త‌న భ‌ర్త ఇంట్లోని ఓ ఫోటో ఆల్బ‌మ్ చూస్తుండ‌గా న‌మ్మ‌లేని, ఊహించ‌లేని వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ ఫొటోలో తన తండ్రి, ప్రస్తుత తన భర్త, ఇతర పిల్లలు ఉన్నారు. దీంతో ఆమె తన భర్తను తన సొంత తాతగా తెలుసుకుని అవాక్కయింది.

ఆమె భర్త చెప్పిన దాని ప్ర‌కారం.. త‌న‌కు రెండు పెళ్లిల్లు. మొద‌టి భార్య‌కు పిల్లలు పుట్టాక మొదటి ఆమె పిల్లలను తీసుకుని గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లిపోయింది. ఆమె గురించి ఎంతగా వెదికినా ఫలితం లేకపోవడంతో అతను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఆమె కూడా విడాకులు తీసుకుని అతడికి దూరమైంది. మళ్లీ ఒంటరిగా మారిన అతడికి రెండేళ్ల క్రితం జాక్‌పాట్‌లో మిలియన్ డాలర్లు వచ్చిపడ్డాయి. దీంతో గతేడాది మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.

ఓ డేటింగ్ ఏజెన్సీని ఆశ్రయించాడు. వారి వెబ్‌సైట్‌లో ఉన్న పలువురు యువతుల ఫొటోలు చూపించారు. అందులో ఓ యువతి ఫొటోను చూసి నచ్చిందని చెప్పాడు. ఆ సమయంలో ఆమె తనకు పరిచయస్తురాలిగా అనిపించిందని, అయితే పెద్దగా పట్టించుకోలేదని అతను పేర్కొన్నాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఓ నిర్ణయానికి వచ్చి వివాహం చేసుకున్నట్టు తెలిపాడు.

ఇదిలా ఉండగా తాను రెండుసార్లు గర్భం దాల్చితే తన తండ్రి(భర్త కొడుకు) తనను ఇంటి నుంచి వెళ్లగొట్టాడని యువతి పేర్కొంది. దీంతో ప్రస్తుతం మిలియనీర్ అయిన భర్తను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడినట్టు తెలిపింది. తనకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేదు అనుభవాన్ని మిగిల్చాయని, మూడోది అలా కాకూడని గట్టిగా నిర్ణయించుకున్నట్టు ఆమె భర్త పేర్కొన్నాడు. ‘‘నేను నా తండ్రి ఫొటోను ఆల్బంలో చూసినప్పుడు నిరాశ ఆవరించింది. దీనివల్ల భర్తతో తన బంధం మరింత బలపడిందని అనుకుంటున్నా’’ అని యువతి పేర్కొంది. ఇద్దరి గురించి అసలు విషయాలు బయటపడినా గత విషయాలు మర్చిపోయి ఒకరికొకరు కలిసి జీవించాలని ఇద్దరు నిర్ణయించుకోవడం కొసమెరుపు.

Loading...

Leave a Reply

*