ఒక్క‌సారి సెక్స్ చేస్తే.. వ‌చ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసా…?

sex

ఆధునిక జీవనం మ‌రీ యాంత్రికంగా మారుతోంది. ప‌ని ఒత్తిడితో మ‌నుషులు పూర్తిగా అల‌సి పోతున్నారు. శారీర‌కంగా, మాన‌సికంగా కూడా మొద్దుబారి పోతున్నారు. చివ‌రికి సుఖ సంసారానికి కూడా దూర‌మ‌వుతున్నారు. అందుకే, ఆరోగ్య‌నిపుణులు.. మాన‌సిక వేత్త‌లు అన్నింటికీ చ‌క్క‌ని ప‌రిష్కార మార్గంగా సెక్స్‌ని సూచిస్తున్నారు.

దంపతులకు శృంగారం మంచి వ్యాయామంతో స‌మాన‌మ‌ట‌. నార్త్ అమెరికాకి చెందిన ఓ ప్ర‌ముఖ సైంటిస్ట్ నిర్వ‌హించిన ప‌రిశోధ‌న ప్ర‌కారం ఒక్క‌సారి సెక్స్ చేస్తే సుమారు 90 నుంచి 100 కేల‌రీల శ‌క్తి ఖ‌ర్చ‌వుతుంది. ఇది దాదాపు 45 నిముషాల పాటు స్లో వాకింగ్ లేదా 30 నిముషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేసిన దానితో స‌మానం. అంటే.. శ‌రీరం ఎంత‌టి శ‌క్తిని కోల్పోతుందో మీరే అంచ‌నా వెయ్యండి. అంతేకాదు, ఈ శారీర‌క శ్ర‌మ వెంట‌నే మాన‌సిక ఒత్తిడిని త‌గ్గిస్తుంది. మెద‌డుని చైత‌న్య ప‌రుస్తుంది. భార్య‌తో భ‌ర్త‌కు, భ‌ర్త‌తో భార్య‌కు మంచి బాండింగ్ ఏర్ప‌డేలా చేస్తుంది.

ఒక్క‌సారి సెక్స్ చేస్తేనే ప‌రిస్థితి ఇది. అదే ఒక్క నైట్‌కి మీరు రెండు మూడు సార్లు సెక్స్‌లో పాల్గొంటే వ‌చ్చే ఉప‌యోగాలు అనేకం. ఒంట్లో ఉన్న కొవ్వు క‌ర‌గ‌డంతోపాటు గుండెతోపాటు ఇత‌ర ప్రాంతాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా బాగా పెరుగుతుంది. దీంతో, గుండె శ‌క్తి కూడా పెరుగుతుందట‌. బ్లడ్ ప్రెజ‌ర్‌ని కూడా నియంత్రిస్తుంది. దీంతో, మ‌నిషి ఎంతో మాన‌సిక, శారీర‌క ఉల్లాసం, ఉత్సాహంతో ప‌రుగులు తీస్తాడ‌ట‌.

మరో అధ్యయనం ప్రకారం డిఫరెంట్ పొజిషన్స్ లో అందులో పాల్గొంటే 85 నుంచి 100 కేలరీల శక్తి ఖర్చు అవుతుందట. ఇది అనేక యోగా ఆసనాలతో సమానం అంటున్నారు వైద్యులు. శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల సంతోషాన్నిచ్చే హార్మోన్‌లు విడుద‌ల అవుతాయి. అంతేకాదు, ఈ స‌మ‌యంలో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుద‌ల అవుతుంది. దీనివ‌ల్ల ఛాతీ కేన్సర్‌సోక‌ద‌ట‌. ప్ర‌తిరోజు శృంగారంలో పాల్గొంటే వ‌చ్చే బెనిఫిట్స్‌లో ఇవి కొన్ని మాత్ర‌మే.

Loading...

Leave a Reply

*