బాలీవుడ్ హాట్ భామ‌తో అంబానీ వార‌సుడి డీప్‌ ల‌వ్‌…!

untitled-16

ముఖేష్ అంబానీ.. వ్యాపారం మిన‌హా మ‌రే ర‌క‌మైన వార్త‌ల‌లో క‌నిపించ‌డానికి సుత‌రాము ఇష్ట‌ప‌డని వ్య‌క్తి. ఆయ‌న‌కు బిజినెస్సే ప్రాణం. మోదీ, చంద్ర‌బాబుకు పాలిటిక్స్ అంటే జీవితం. సేమ్ అలానే ముకేష్ అంబానీ నిఖార్స‌యిన బిజినెస్‌మేన్‌గా ఉండ‌డానికి ఇష్ట‌ప‌డే వ్య‌క్తి. తండ్రి ధీరుబాయ్ అంబానీ నుంచి వచ్చిన ఆ వార‌స‌త్వాన్ని కొన‌సాగించ‌డానికే ఆయ‌న ఇష్ట‌ప‌డ‌తారు. కానీ, ఆయ‌న వారసులు మాత్రం దీనికి భిన్నంగా వెళుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

బాలీవుడ్ హాట్ బ్యూటీ క‌త్రినా కైఫ్‌తో అంబానీ త‌న‌యుడు ఆకాష్ అంబానీ స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ ఏదో న‌డుపుతున్నాడంటూ వార్త‌లు షికారు చేస్తున్నాయి. నెల రోజుల గ్యాప్‌లోనే ఈ ఇద్ద‌రూ రెండు వేర్వేరు ఫంక్ష‌న్‌ల‌లో క‌నిపించ‌డం ఈ రూమ‌ర్‌ల‌కు బలాన్ని ఇస్తోంది. మొన్న దీపావ‌ళికి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ ఇంట్లో జ‌రిగిన సెల‌బ్రేష‌న్స్‌కి ప‌లువురు ప్ర‌ముఖుల‌కి ఇన్విటేష‌న్‌లు పంపాడు. ఈ విందుకి అందాల ముద్దుగుమ్మ‌ క‌త్రిన కైఫ్‌తో పాటు ఆకాష్ అంబానీ కూడా అటెండ్ అయ్యాడు. ఇద్ద‌రూ క‌లిసి ఒకే కారులో రావడం హాట్ టాపిక్‌గా మారింది.

దీని త‌ర్వాత‌ వారం గ్యాప్‌లో జ‌రిగిన మ‌రో ఫంక్ష‌న్‌కి కూడా కలిసే హాజ‌ర‌య్యార‌ట‌. అప్ప‌టిదాకా కేవ‌లం బ్రేకింగ్ న్యూస్‌గా, కేవ‌లం వెబ్‌సైట్ న్యూస్‌గా మాత్ర‌మే ఉన్న వార్త‌.. హెడ్‌లైన్‌గా మారిందంటున్నారు. ప్ర‌స్తుతం క‌త్రిన ఖాళీ. స‌ల్మాన్‌కి హ్యాండ్ ఇచ్చి ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో కొన్నాళ్లు డేటింగ్ న‌డిపింది. ఆయ‌న‌కు కూడా క‌టీఫ్ చెప్పి సిద్దార్ధ్ మ‌ల్‌హోత్రాతో ప్రేమాయ‌ణం సాగించింద‌నే గాసిప్‌లు వినిపించాయి. తాజాగా, అంబానీ వార‌సుడితో చెట్ట‌ప‌ట్టాలేసుకొని తిరుగుతోంది. మ‌రో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. అంబానీ త‌న‌యుడు ఆకాష్ కంటే.. క‌త్రిన వ‌య‌సులో ఎనిమిదేళ్లు పెద్ద‌ది కావ‌డం. అయినా ప్రేమ‌కు ఏజ్ మేట‌రా చెప్పండి.. మొత్త‌మ్మీద‌, అంబానీ వార‌సుడు స‌క‌ల‌క‌ళా వ‌ల్ల‌భుడు అనిపించుకుంటాడేమో చూడాలి.

Loading...

Leave a Reply

*