ఐదేళ్ల బాలిక‌పై చ‌ర్చి ఫాద‌ర్ అత్యాచారం.. బొమ్మ‌గీసి ప‌ట్టించిన బాలిక‌..!

5years-old-girl

ఇదో షాకింగ్ వార్త‌. మాన‌వ‌త్వం, మ‌త విలువ‌లు ప్ర‌బోధించే ఓ చ‌ర్చి ఫాద‌ర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఏకంగా ఐదేళ్ల బాలిక‌పైనే అత్యాచారం చేశాడు. చ‌ర్చికి రోజుకు చ‌దువుకోవ‌డానికి వ‌చ్చే బాలిక‌ను అత్యంత పాశ‌వికంగా రేప్ చేశాడు. ఆమెను లైంగికంగా హింసించాడు. ఇదే ఎంద‌రినో క‌లిచి వేస్తుంటే.. అది బ‌య‌ట‌ప‌డిన తీరు అంద‌రినీ క‌లిచివేస్తోంది. ఎలా చెప్పాలో తెలియక ఆ బాలిక బొమ్మలు గీసి మ‌రీ చూపించింది. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ బొమ్మ‌ల ఆధారంగానే చ‌ర్చి ఫాద‌ర్‌కి త‌గిన బుద్ధి చెప్పారు ఆ బాలిక త‌ల్లిదండ్రులు.

ఈ ఘ‌ట‌న బ్రెజిల్‌లో జ‌రిగింది. చర్చి ఫాదర్ దగ్గరకు రోజూ చదుకోవడానికి వెళ్లే జావో దాసిల్వ‌ ఐదు సంవత్సరాల బాలిక క్లాసులకు వెళ్లేది. కానీ ఇకపై క్లాసులకు వెళ్లనని మారాం చేయడం మొదలుపెట్టింది. విసుగెత్తిన తల్లితండ్రులు ఎందుకు వెళ్లవని గట్టిగా ప్రశ్నించడంతో అస‌లు విషయం బయటపడింది. ఆ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియని చిన్నారి తన భావాన్ని, బాధను బొమ్మలు గీచి వివరించింది. బాలిక గీచిన చిత్రాలను చూసిన తల్లితండ్రులను భయబ్రాంతులకు గురిచేసింది.

తనను చర్చి ఫాదర్ ఏవిధంగా లైంగికంగా వేధించేవాడో రెండు చిత్రాలను బాలిక గీచింది. బాలిక గీసిన చిత్రాలు పలువురిని కలచివేస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిన అరెస్ట్ చేశారు. ఈ ఘటన బ్రెజిల్‌లో జరిగింది. చిన్నపిల్లపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన చర్చి ఫాదర్‌పై ఆందోళనలు మిన్నంటాయి. ఇలాంటి దారుణాలు జరగడం శోచనీయమని ప్రపంచవ్యాప్తంగా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Loading...

Leave a Reply

*