వ‌న్డేలో 1400 కోట్లు కొల్ల‌గొట్టిన ఫ్లిప్‌కార్ట్‌

flipkart

వ‌న్డే మ్యాచ్‌లో ఒకే రోజు 1400 ర‌న్స్ కొట్ట‌లేక‌పోవ‌చ్చుగానీ వాళ్లు వ‌న్డేలోనే 1400 కోట్లు కొల్ల‌గొట్టారు… వేలు ల‌క్ష‌లు కాదు 1400 కోట్ల రూపా య‌లు గల్లాపెట్టెలో వేసేసుకున్నారు…. ఆన్‌లైన్‌ అమ్మ‌కాల్లో అద్భుత రికార్డులు సాధించింది ఈ – కామ‌ర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌… మ‌న‌వాళ్లు ఏదైనా ఫ్రీగా ఇస్తామంటే అవ‌స‌రం లేక‌పోయినా ఫినాయిల్ కొనేస్తార‌ని, బంప‌ర్‌ ఆఫ‌ర్లు ఇస్తే ఆత్రంగా ప‌ర్సులు ఖాళీ చేసేసుకుంటార‌ని ఫ్లిప్‌కార్ట్ మ‌రోసారి నిరూపించింది… ధ‌ర‌లు త‌గ్గించి అద‌ర‌హో అనేట్టు అమ్మ‌కాలు జ‌రిపింది ఫ్లిప్‌కార్ట్‌….. ద‌స‌రా, దీపావ‌ళి ధ‌మాకా ఆన్‌లైన్ సేల్స్‌లో క‌నీసం వెయ్యి కోట్ల అమ్మ‌కాలు టార్గెట్‌గా పెట్టుకుంది ఫ్లిప్‌కార్ట్‌…. అయితే మొద‌టి రోజు అమ్మ‌కాలే రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాయి…

నిన్న స్నాప్‌డీల్ రికార్డ్ సేల్స్ సాధిస్తే దాన్ని బ‌ద్ద‌లు కొట్టింది ఫ్లిప్‌కార్ట్‌.. తొలిరోజు అమ్మ‌కాల్లోనే 1400 కోట్ల రూపాయ‌ల బోణీ కొట్టి రేసులో దూసుకు పోయింది ఫ్లిప్‌కార్ట్‌… గ‌త ఏడాది కంటే ఈ ఏడాది అమ్మ‌కాలు రెట్టింపు అయ్యాయ‌ని స‌మాచారం… వాస్త‌వానికి వెయ్యి కోట్ల అమ్మ‌కాల టార్గెట్ పెట్టుకుంటే తొలి రోజులోనే దాన్ని అధిగ‌మించేశామ‌ని ఫ్లిప్‌కార్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈవో బిన్నీ బ‌న్స‌ల్ చెప్పారు…. తొమ్మిదేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో కేవ‌లం పుస్త‌కాల అమ్మ‌కాల‌తో వ్యాపారం ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఇంత భారీగా అమ్మ‌కాలు జ‌రప‌గ‌లుగుతోంది… ఒక్క రోజులోనే గ్రాస్ అమ్మ‌కాలు ఇంత స్థాయిలో ఉండ‌డం ఇప్ప‌టివ‌ర‌కు మ‌రే ఇత‌ర భార‌తీయ ఈ-టైల‌ర్‌కు సాధ్యం కాలేద‌ని చెబుతున్నారు…

ద‌స‌రా, దీపావ‌ళి సీజ‌న్ సంద‌ర్భంగా మొత్తం ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు అన్ని క‌లిసి ఐదు రోజుల అమ్మ‌కాల్లో 12 వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు సాధిస్తారయ‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి… గ‌త ఏడాది ఇదే సీజ‌న్‌లో మొత్తం ఆన్‌లైన్ అమ్మ‌కాలు కేవ‌లం 7 వేల కోట్లు మాత్ర‌మే… దీన్నిబ‌ట్టి చూస్తే భారతీయ ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్ రోజురోజుకు పెరుగుతోందంటున్నారు ఆన్‌లైన్ నిపుణులు. ఫ్లిప్‌కార్ట్ సేల్స్ చూసి అమెజాన్‌, స్నాప్‌డీల్‌కు మైండ్ బ్లాంక్ అయిపోయింది.

Loading...

Leave a Reply

*