గోదావ‌రి జిల్లాల్లో కార్ల‌లోనుంచి ఎగిరిపడుతున్న 1000,500 నోట్లు..!

untitled-15

పెద్ద నోట్ల ర‌ద్దుతో ఇప్పుడు దేశంలో నోట్ల క‌ట్ట‌ల‌కు రెక్క‌లొచ్చాయి. ఇళ్ల‌లో… లాక‌ర్ల‌లో మూలుగుతున్న క‌ట్ట‌ల క‌ట్ట‌ల కోట్ల క‌ట్ట‌లు రెక్క‌లు వ‌చ్చి ఎగిరెగిరి పడుతున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల‌తో పాటు… తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. త‌మ వ‌ద్ద పేరుకుపోయిన డ‌బ్బు ఇప్పుడెలా వైట్ చేసుకోవాలో తెలియ‌క‌… చాలామంది కిందా మీదా ప‌డుతున్నారు. ఎక్కువ కాలం ఆ న‌ల్ల ధ‌నాన్ని త‌మ వ‌ద్ద ఉంచుకోవ‌డం ప్రమాద‌క‌ర‌మ‌ని భావించిన చాలామంది ఇప్పుడు వాటిని కార్ల‌లో తీసుకుని బ‌య‌ట‌కెళ్లి… ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ విసిరేస్తున్నారు.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌నే దానికి నిద‌ర్శ‌నం. జిల్లాలోని ద్వారకా తిరుమ‌ల‌లో ఒక ఏటీఎం వ‌ద్ద నోట్లు గాల్లో తేలుతూ వ‌చ్చాయి. కారులో కోట్ల రూపాయ‌ల క‌ట్ట‌లు తీసుకొచ్చిన కొంద‌రు వాటిని అందులోనుంచే… వాటిని రోడ్డుపైకి వెద‌జ‌ల్లారు. ఒక్క‌సారిగా నోట్లు ఎగురుకుంటూ వ‌చ్చి రోడ్డంతా ప‌రుచుకోవ‌డంతో వాటిని తీసుకునేందుకు జ‌నం ఎగ‌బ‌డ్డారు. ఇక‌, హైద‌రాబాద్‌లో మ‌రో విచిత్ర‌మైన సంఘ‌ట‌న జ‌రిగింది. ఇద్ద‌రు వ్య‌క్తులు బైక్‌పై వెళ్తూ ఒక బ్యాగును రోడ్డుపై జార‌విడిచి వెళ్లారు. వారి వెనుకే వ‌స్తున్న మ‌రో వ్య‌క్తి ఆ బ్యాగును గ‌మ‌నించి జారిపోయిందేమో అని వారిని పిల‌వ‌డం ప్రారంభించాడు.

అయితే, ఇత‌డు పిల‌వ‌డం చూసి బ్యాగును వ‌దిలిపెట్టిన అగంత‌కులు మ‌రింత స్పీడుగా వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసిన వారిని పిలిచిన వ్య‌క్తి అక్క‌డి సీన్ చూసి బిత్త‌ర‌పోయాడు. మ‌రో బైకుపై వ‌చ్చిన ఇద్ద‌రు ఆ బ్యాగును తీసుకుని వెళ్లిపోయారు. అప్పుడు గానీ వెల‌గ‌లేదు మ‌నోడికి అది నోట్ల క‌ట్ట‌లు ఉన్న బ్యాగ‌ని. క‌ళ్ల‌ముందు… కాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన నోట్ల బ్యాగును జార‌విడుచుకున్నానే అని ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. హ‌త‌విధీ.

Loading...

Leave a Reply

*